కోదండరాం నియంత పోకడతో పార్టీ నాశనం: వెదిరె

29 Sep, 2020 10:02 IST|Sakshi

సాక్షి, నల్గొండ: టీజేఏసీ వ్యవస్థాపకుడు కోదండరాం నాయకులను చేయగలరు కానీ.. ఆయన మాత్రం నాయకుడు కాలేరని వెదిరె చల్మారెడ్డి విమర్శించారు. టీజేఎస్‌ రైతు విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఆయన తన అనుచరులతో కలిసి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం వెదిరె మీడియాతో మాట్లాడుతూ... ఏదైనా పార్టీలో సమష్టి నిర్ణయం ఉంటుందని కానీ, జన సమితిలో మాత్రం అభిప్రాయాలు అందరివీ తీసుకుని ఆఖరుకు నిర్ణయం మాత్రం కోదండరాం ఒక్కరిదే ఉంటుందని ఆరోపించారు.

ఆయన నియంత పోకడలతో పార్టీని నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుతం పార్టీలో వంద మందితో సమావేశం ఏర్పాటు చేసే శక్తి పార్టీ నేతలలో ఒక్కరు కూడా లేరని, కేవలం భజనపరులే ఉన్నారని ఆయన ఎద్దేవ  చేశారు. అలాగే చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ.. తాను నల్లగొండ జిల్లా వాసిగా వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో కలసి పనిచేద్దామని కూడా చెప్పానని, కానీ కోదండరాం తానే స్వయంగా నిలబడుతున్నానని తనకు మద్దతు ఇవ్వాలని కోరారని వెల్లడించారు. ఓ అభ్యర్థి ఇలా మద్దతు అడగటం చరిత్రలో ఇదే మొదటిసారని సుధాకర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు