హుజూరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తాం: కోదండరామ్‌

11 Jul, 2021 12:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు  కోదండరామ్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు నెల చివరిలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తే లేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని కోదండరామ్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు