కోదండరాం పోటీపై టీజేఎస్‌ క్లారిటీ

5 Oct, 2020 14:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ప్రొఫెసర్‌ కోదండరాం పోటీపై క్లారిటీ వచ్చింది. నల్లగొండ - వరంగల్ -ఖమ్మం అభ్యర్థిగా ప్రొఫెసర్‌ కోదండరాం పోటీ చేస్తున్నారని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) వెల్లడించింది. ఈమేరకు పార్టీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇక సార్‌ పోటీపై స్పష్టత వచ్చినప్పటికీ కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రుల ఎన్నికలను నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి కోదండరాంకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలుస్తుందనే వార్తలు వెలువడ్డాయి.
(చదవండి: దుబ్బాక ఎన్నిక : టీఆర్‌ఎస్‌కు‌ ఝలక్‌)

అయితే, జిల్లా స్థాయి నేతలు మాత్రం పార్టీ కోసం పనిచేసినవారిలో నుంచి బలమైన వ్యక్తిని ఎన్నికల్లో పోటీకి దింపాలను టీపీసీసీ అగ్రనేతలకు సూచించారు. మరోవైపు ‘వరంగల్‌, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కోదండరామ్‌కి మద్దతుపై కోర్ కమిటిలో చర్చించాం. దాని సూచన మేరకు తుది నిర్ణయం ఉంటుంది’ అని తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్ చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి వరంగల్‌ నుంచి ఆరుగురు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారంతా టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
(చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓరుగల్లులో పోటాపోటీ ప్రయత్నం)

మరిన్ని వార్తలు