ముచ్చటగా మూడోసారి: గవర్నరుతో భేటీ కానున్న మమత

3 May, 2021 14:33 IST|Sakshi

భారీ విజయాన్ని సొంతం చేసుకున్న టీఎంసీ

కొత్త సర్కార్‌ కొలువు దీరేందుకు యత్నాలు  

కోల్‌కత: ప‌శ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎ​న్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ శరవేగంగా కదులుతున్నారు. కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులతో  ఆమె కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సీఎం మమతా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌తో రాత్రి 7 గంటలకు భేటీ కానున్నారు.

ఒక‌ప్పుడు బెంగాల్‌లో క‌మ్యూనిస్ట్ కంచు కోట‌ను బ‌ద్ద‌లుకొట్టిన మమత మోదీ-షా ద్వయాన్ని కూడాఅంతే ధీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ‘దీదీ ఓ దీదీ నీతో పాటు నీ పార్టీని కూడా బెంగాల్‌ ప్రజలు సాగనంపుతారం’ టూ ఎద్దేవా చేసిన ప్రధాని మోదీని తిరుగులేని దెబ్బ కొట్టారు.  2016 కంటే కూడా ఎక్కువ స్థానాలను సొంతం చేసుకున్నారు.  2021 ఎన్నికల్లో మమతా నేతృత్వంలోని టీఎంసీ పార్టీ రాష్ట్రంలో పూర్తి మెజారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగిన నందిగ్రామ్ ఓట‌మిని  లైట్ తీసుకున్న ఆమె ముచ్చ‌ట‌గా మూడోసారి అధికార పీఠం ఎక్క‌ బోతున్నారు.  భారత రాజ్యాంగం ఆర్టికల్ 164(4)ప్రకారం ఆమె సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు నందీగ్రామ్‌లో ప్రత్యర్థి సువేందు అధికారి విజయాన్ని మమతా కోర్టులో సవాల్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా టీఎంసీ అద్భుత విజయంతొ  రియల్‌ ఫైటర్‌ మమతా బెనర్జీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒంటికాలితో విజయాన్ని అందుకున్న బెంగాల్‌ బెబ్బులి, కలకత్తా కాళి, అంటూ నెటిజన్లు  ఆమెను సూపర్‌ స్టార్‌ను చేశారు. ఈ సందర్భంగా  1980 నాటి మ‌మ‌త ఫొటో ఒక‌టి తెగ వైర‌ల్ అవుతోంది. 

చదవండి: మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్‌

మరిన్ని వార్తలు