Telugu Top News: ఈవెనింగ్‌ హైలైట్‌ న్యూస్‌

14 Nov, 2022 18:01 IST|Sakshi

1.  అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
ఆదాయార్జన శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్‌
ఉప ఎన్నిక ముగిసి వారం రోజులు దాటినా కానీ మునుగోడులో రాజకీయ కాక మాత్రం తగ్గలేదు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించారు. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. లోకేష్‌ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి
ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్‌ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ అంటూ ఎద్దేవా చేశారు. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. 'కాంగ్రెస్‌కి వేసి ఓట్లను వృధా చేయకండి': అరవింద్‌ కేజ్రీవాల్‌
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌ ప్రజలను కాంగ్రెస్‌కి ఓటు వేసి ఓట్లను వృధా చేయకండి అన్నారు. అందుకు బదులుగా ఆప్‌కి ఓటు వేసి గెలిపించండి అని ప్రజలను అభ్యర్థించారు. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. భర్తను చంపేందుకు ఆరుసార్లు యత్నం...మహిళకు 50 ఏళ్లు జైలు శిక్ష
మురికవాడలో పెరిగిన ఒక నిరుపేద మహిళను పెళ్లి చేసు​కుని మంచి జీవితం ఇచ్చాడు. రాజకీయ నాయకురాలిగా ఎదిగేలా చేశాడు. అందుకు ప్రతిఫలంగా భర్తనే కడతేర్చేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. యువతితో సహజీవనం, హత్య, ముక్కలుగా నరికి.. ఢిల్లీ అంతటా 18 రోజుల్లో..
ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని యువకుడు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్‌ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. యువతితో పరిచయం, సహజీవనం, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా కోయడం, ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని భద్రపరిచిన తీరు విస్మయానికి గురి చేస్తోంది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

7. ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌! ‘ఆర్నెళ్ల పాటు..!’
టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది కుడి మోకాలికి గాయమైన విషయం విదితమే. ఈ గాయం తీవ్రతరం కావడంతో అతడు స్వదేశంలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్యకు అ‍స్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్‌లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. అత్యవసర చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు  చికిత్స అందిస్తున్నారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. షాకింగ్‌,ఎలాన్‌ మస్క్‌ భారీ షాక్‌.. మరోసారి వేల మంది ట్విటర్‌ ఉద్యోగుల తొలగింపు
మల్టీమిలియనీర్‌, ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్‌ ఇవ్వనున్నారు. గత వారంలో ట్విటర్‌లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం అంటే సుమారు 3500 మందిపై వేటు వేశారు. అయితే ఈ వారం ముగిసేలోపే భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Children's Day 2022: పిల్లలవాణి.. స్కూల్‌ రేడియో! అంతా వాళ్లిష్టమే
బడి అంటే పాఠాల బట్టీ కాదు..  వినోదం.. విజ్ఞానం కూడా! వాటిని పంచే ఓ సాధనం రేడియో! ఎస్‌.. ఆకాశ వాణి! కాకపోతే ఇది పిల్లల వాణి.. దీనికి కేంద్రం స్కూల్‌! అనౌన్సర్లు, రైటర్లు, స్టోరీ టెల్లర్లు, ఆర్టిస్టులు, ప్రోగ్రామ్‌ డిజైనర్లు.. స్టేషన్‌ డైరెక్టర్లు అందరూ పిల్లలే! అంటే విద్యార్థులే!! మరి శ్రోతలు..?
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు