Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

5 Nov, 2022 10:05 IST|Sakshi

1. ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఇటు వైపు అడుగులు వేస్తున్నారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్‌
తలసేమియా వ్యాధితో బాధపడుతోన్న బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణపేటకు చెందిన బాలుడు దంగేటి యశ్వంత్‌(7) చికిత్సకు సీఎం వైఎస్‌ జగన్‌ సహాయం అందించారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మునుగోడుపై టీఆర్‌ఎస్‌ పోస్ట్‌మార్టం.. ఆ నివేదికలో ఏముంది? 
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ గురువారం రాత్రి వరకు కొనసాగడంతో బూత్‌ల వారీగా పోలింగ్‌ సరళిపై టీఆర్‌ఎస్‌ పార్టీ శుక్రవారం పోస్ట్‌మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. 

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4.ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. పీఎంఓ సీరియస్..!
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చినికిచినికి గాలివానలా మారుతుండటం, నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలపైనే ఆరోపణలు రావడంతో.. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు
సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్‌ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. 

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నన్ను చంపజూసింది ప్రధానే
ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తనను చంపేందుకు కుట్ర పన్నారని పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. సెలూన్‌ వ్యాపారంలోకి రిలయన్స్‌!
వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇప్పుడు సెలూన్‌ వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. గ్రూప్‌ సంస్థ, దేశీయంగా అతి పెద్ద రిటైలింగ్‌ కంపెనీ అయిన రిలయన్స్‌ రిటైల్‌ తాజాగా చెన్నైకి చెందిన నేచురల్స్‌ సెలూన్‌ అండ్‌ స్పాలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. తప్పయింది క్షమించండి: మేకప్‌ ఆర్టిస్ట్‌ శ్వేతారెడ్డి
కాంతార సినిమా తరహాలో పంజర్లి దేవుడి వేషం వేసి రీల్స్‌ చేసి తుళునాడు (కొడగు) ప్రజల ఆక్రోశానికి గురైన హైదరాబాద్‌కు చెందిన మేకప్‌ ఆర్టిస్ట్‌ శ్వేతారెడ్డి ధర్మస్థల మంజునాథస్వామి సన్నిధిలో క్షమాపణలు కోరారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కోహ్లి కెరీర్‌లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు..
విరాట్‌ కోహ్లి ఇవాళ(నవంబర్‌ 5న) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లి గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.అయితే ప్రతీ మనిషికి ఎదురుదెబ్బలు తగులుతుంటాయి.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ప్రేమించొద్దని చెప్పినా వినలేదని..
ప్రేమ వ్యవహారం వద్దని నచ్చజెప్పినా వినలేదని కన్న కూతురిని తండ్రి హత్యచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు