Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

4 Nov, 2022 10:09 IST|Sakshi

1. తూర్పుగోదావరికి సీఎం జగన్‌.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్‌ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. టీడీపీ దొంగాట!.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల  నమోదులో వక్రబుద్ధి
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన విద్యాసంస్థలు, కళాశాలలు ఉండడంతో రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో నాన్‌టీచింగ్‌ సిబ్బందినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. కేసీఆర్ విడుదల చేసిన 70 నిమిషాల వీడియో సంభాషణ ఇదే..
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి సంబంధించి మొయినాబాద్‌ మండలంలోని అజీజ్‌నగర్‌ ఫామ్‌హౌస్‌లో బీజేపీ దూతలుగా చెబుతున్న వారి మధ్య జరిగిన వీడియో సంభాషణల రికార్డింగ్‌ను (మొత్తం నాలుగు క్లిప్‌లు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం బహిర్గతం చేశారు.
👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పెరిగిన ఓటింగ్‌ శాతం.. బీజేపీ ఏమంటోంది?
మునుగోడులో ఓటింగ్‌ సరళి, వివిధ వర్గాల ఓటర్ల స్పందనను బట్టి బీజేపీదే గెలుపు అని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు న్నారు. పెరిగిన ఓటింగ్‌ శాతం, సాయంత్రం దాకా ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు వెల్లువెత్తడం వంటివి తమకు అనుకూలమని అంచనా వేస్తున్నారు.
👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5.గుజరాత్‌లో ముక్కోణపు పోటీ!
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలయ్యింది. కొత్తగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఆగమనంతో ఈసారి ముక్కోణపు పోటీ జరగబోతోంది. రాష్ట్రంలో దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఎన్నికల పోటీ కొనసాగుతోంది. ఇప్పుడు ‘ఆప్‌’ సైతం ఆ రెండు పార్టీలకు సవాళ్లు విసురుతూ రణరంగంలోకి అడుగు పెడుతోంది.
👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు
ఆయన పేరు మైక్‌ మెరిల్‌. అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ‘టెక్‌ సపోర్ట్, వెబ్‌3 డెవలప్‌మెంట్‌’ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు 2008లో ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. కంపెనీలు, షేర్లు ఎందుకుగానీ.. తనకు తానే ఓ కంపెనీగా చేసుకుని, తన జీవితాన్నే షేర్లుగా మార్చి అమ్ము కోవాలని నిర్ణయించుకున్నాడు.
👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Shikha Khanna: నూరు తల్లుల కథ
31 ఒక్క దేశాలు. 100 మంది తల్లులు. వారు టీచర్లు, సైంటిస్ట్‌లు, క్రీడాకారులు, సంగీతకారులు, మహిళా సైనికులు... రంగాలు వేరు. కాని మాతృత్వం ఒకటే. ఒక మహిళ నిర్వహించే అత్యుత్తమ కర్తవ్యం తల్లి కావడం. అందుకు ప్రతి  తల్లీ ఒక భిన్న ప్రయాణం చేస్తోంది.
👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అక్టోబర్‌లో ‘సేవలు’ బాగున్నాయ్‌!
భారత్‌ సేవల రంగం అక్టోబర్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ సూచించింది. సెప్టెంబర్‌లో ఆరు నెలల కనిష్టం 54.3కు పడిపోయిన సూచీ, అక్టోబర్‌లో 55.1కు ఎగసింది. 
👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కోహ్లి "ఫేక్‌ ఫీల్డింగ్‌" ఆరోపణలు .. వివరణ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్‌
బంగ్లాదేశ్‌తో అఖరి హోరాహోరీగా జరిగిన పోరులో 5 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి "ఫేక్‌ ఫీల్డింగ్‌" చేశాడని బంగ్లా బ్యాటర్‌ నూరల్‌ హసన్‌ ఆరోపణలు చేశాడు.  ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వివాదాస్పద ఘటనపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు.
👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

​​​​​​​

10. ‘బనారస్‌’మూవీ రివ్యూ
సిద్ధార్థ్‌(జైద్‌ ఖాన్‌) ఓ ధనవంతుడి కుటుంబానికి చెందని యువకుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో తండ్రి గారాబంగా పెంచుతాడు. స్నేహితులతో పార్టీలు.. ట్రిప్స్‌ అంటూ లైఫ్‌ని ఎంజాయ్‌ చేసే సిద్ధార్థ్‌.. ఓ పందెంలో నెగ్గడం కోసం ధని(సోనాల్‌ మోంటెరో)కి దగ్గరవుతాడు.
👉:​​​​​​​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు