Telugu Top News: ఈవెనింగ్‌ హైలైట్‌ న్యూస్‌

13 Nov, 2022 17:58 IST|Sakshi

1. రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్‌
మంగళగిరిలో జనసేన నాయకులపై టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లను పరిశీలించడానికి జనసేన కార్యకర్తలు మంగళగిరిలోని జగనన్న నగర్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులను లబ్ధిదారులు అడ్డుకున్నారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఊహించని షాక్‌
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ప్రజలు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. విజయనగరం జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌.. తీవ్ర అసహనం
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గుంకలాం జగనన్న కాలనీ పర్యటన అట్టర్‌ ప్లాప్‌ అయింది. జగనన్న గృహ లబ్ధిదారుల నుంచి కనీస స్పందన కరువైంది. గత కొద్ది రోజులుగా జనసేన నాయకులు జగనన్న ఇళ్లు పేదల కన్నీళ్లు అంటూ ప్రచారం చేశారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్‌.. ప్రాపర్టీ కూల్చివేత
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందిన అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫిల్మ్‌నగర్‌లోని హోటల్‌ డెక్కన్‌ కిచెన్‌లో కొంతభాగాన్ని జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తొలగించారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మోదీ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం!
ఉదయ్‌పుర్- అహ్మదాబాద్‌ రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ జిల్లాలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. ఓడ బ్రిడ్జ్‌ నుంచి ఈ పేలుడు శబ్దం వచ్చినట్లు గమనించిన స్థానికులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరి అంత తక్కువా?
చాలా మందికి ఒక ఇల్లు లేదా విల్లా కొనుగోలు చేయలానే కల ఉంటుంది. కానీ, ఎవరికైనా ఒక గ్రామాన్ని కొనుగోలు చేయాలనుంటుందా? బాగా డబ్బు ఉన్న వాళ్లు రెండు మూడు ప్రాంతాల్లో నివాస గృహాలు కొనుగోలు చేయటం సహజమే. అయితే, ఒక గ్రామం మొత్తం అమ్మకానికి ఉంటే.. అది కేవలం ఒక ఇంటి ధరకే వస్తే..? ఆ ఆలోచనే నమ్మశక్యంగా లేదు కదా!
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. T20 WC 2022 Final Winner: పాకిస్తాన్‌ను చిత్తుచేసి విశ్వవిజేతగా ఇంగ్లండ్‌
పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ మరోసారి జగజ్జేతగా నిలిచింది. 2010లో పాల్‌ కాలింగ్‌ వుడ్‌ బృందం ట్రోఫీ గెలవగా.. బట్లర్‌ సేన టీ20 ప్రపంచకప్‌-2022 కప్‌ను సొంతం చేసుకుంది. దీంతో మరోసారి వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలవాలన్న పాక్‌ ఆశలు అడియాసలయ్యాయి.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. పుష్ప-2 మేకర్స్‌పై బన్నీ ఫ్యాన్స్‌ ఫైర్.. గీతా ఆర్ట్స్‌ వద్ద టెన్షన్
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు బన్నీ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  పుష్ప- 2 మూవీ అప్ డేట్స్‌ త్వరగా ఇవ్వాలంటూ అభిమానులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. సామాన్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు!
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నిత్యవసరాల సరుకుల ధర పెరగడంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు కాస్త ఊరటరానుంది. దేశంలో కుకింగ్ ఆయిల్ రేట్లు (Cooking Oil) దిగివచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. IBS Ragging: ఐబీఎస్‌ కాలేజ్‌ ర్యాగింగ్‌ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్‌ కళాశాల ర్యాగింగ్‌ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి.  ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్‌పల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు