కేసీఆర్‌ పెద్దకొడుకు కాదు దొంగ కొడుకు: రేవంత్‌రెడ్డి 

25 Oct, 2021 02:18 IST|Sakshi

కమలాపూర్‌: రూ.2వేల పింఛన్‌ ఇస్తున్నంత మా త్రాన సీఎం కేసీఆర్‌ మీకు పెద్ద కొడుకు కాదని దొంగ కొడుకని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మీ కన్నకొడుకులకో బిడ్డలకో నౌకరొస్తే రూ.40వేల నుంచి రూ.50 వేల జీతమొస్తే బిచ్చంలా ఇచ్చే ఆ పింఛన్‌ ఎందుకని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల కొలువుల్ని సీఎం కేసీఆర్‌ భర్తీ చేయడం లేదని, ఆయన తన ఇంటిల్లిపాదికి నౌకర్లు ఇప్పించుకున్నారు కానీ..ఏడేళ్లుగా మన పిల్లలకు మాత్రం కొలువులివ్వడం లేదని ఆరోపించారు.

హుజూరాబాద్‌ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం హను మకొండ జిల్లా కమలాపూర్‌లో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి వరకు కారెక్కి తిరిగిన ఈటల రాజేందర్‌ నేడు కమలం గుర్తంటూ మన దగ్గరకు వస్తున్నాడని, సారా పాతదే కానీ..సీసా మాత్రమే కొత్తదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్‌ రూ. 400 ఉండేదని, నేడు అది రూ. వెయ్యి అయ్యిందని, కష్టపడ్డ పైసల్ని రూ. వెయ్యి సిలిండర్‌కు కడుతుంటే కళ్ల వెంట నీళ్లొస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బరిలో నిలిపిందని, వెంకట్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు