‘కాంగ్రెస్‌ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు’

30 Sep, 2023 16:49 IST|Sakshi

హైదరాబాద్‌:  వారంటీ లేని కాంగ్రెస్‌ పార్టీకి గ్యారెంటీ లేదంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.  కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే కొడుకేమే పూర్తిగా మతి తప్పి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించి కలవరించే మీరా కాంగ్రెస్‌ గురించి మాట్లాడేది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 

పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి,తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు. దళిత బంధులో  30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని స్వయంగా మీ అయ్యనే ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు. లిక్కర్ స్కామ్ లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసిందని  దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు.భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు. తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నరో, ఎన్నిఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నరో, ఎన్ని లక్షల చ. అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్‌ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు’ అని మండిపడ్డారు.

చదవండి: నేను పురుషులకంటే మెరుగ్గానే పనిచేస్తా: గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు