రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్‌

27 Jul, 2022 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పందించారు. రాజగోపాల్‌ రెడ్డి అంశం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. రాజగోపాల్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 

మరోవైపు రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌గా ఉంది. బీజేపీ కండువా కప్పుకోకముందే అతనిపై వేటువేసే అవకాశం కనిపిస్తోంది. షాకాజ్‌ నోటీసులు జారీ చేయాలా.. వేటు వేయాలా అనే దానిపై ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై పీసీసీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయగా.. వీడియో క్లిప్పింగ్‌లు, పత్రిక ప్రకటనలతో నివేదిక అందించింది.

మరోవైపు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల, వివేక్‌లతో రాజగోపాల్‌రెడ్డి చర్చలు జరిపారు. ఇక ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయనుండటంతో మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 
చదవండి: రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరుతారు: బండి సంజయ్‌

మరిన్ని వార్తలు