కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

10 Nov, 2022 01:44 IST|Sakshi

కమ్యూనిస్టుల మద్దతుతో గెలవడం టీఆర్‌ఎస్‌ గొప్పనా?

కాంగ్రెస్‌ను మూడోస్థానానికి పంపడానికి ఇన్ని కుతంత్రాలా?

పోలీసుల వద్ద ఉండాల్సిన ఫాంహౌజ్‌ వీడియోలు ప్రగతిభవన్‌లో ఎందుకున్నాయి

వెంకట్‌రెడ్డి వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిది కాదని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలవదని స్వయంగా ఒప్పుకొన్న కేసీఆర్‌ కమ్యూనిస్టుల సహకారంతో మునుగోడులో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో పరాన్న జీవిగా మారిందని ఎద్దేవా చేశారు. రేవంత్‌ బుధవారం తన నివాసంలో మీడియాతో మా ట్లాడుతూ కమ్యూనిస్టుల సహకారంతో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పారించి సాధించిన గెలుపు కూడా గెలుపేనా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు సహజమిత్రు లని, ఇప్పుడేదో మోజులో కేసీఆర్‌కు మద్దతి చ్చారన్నారు. కేసీఆర్‌ అక్కున చేరిన వాళ్లెవ రూ మళ్లీ కనిపించలేదని, ఆ విషయం క మ్యూనిస్టులకు కూడా తెలుసని పేర్కొన్నారు.

దేశానికి నాయకుడవుతానన్న కేసీఆర్‌ సొంత కాళ్లపై నిలబడలేకపోయారని ఎద్దేవా చేశారు. మునుగోడులో బీజేపీ బరితెగించిందని, రూ. వందల కోట్లు పంచిపెట్టి దేశంలో మునుగోడును తాగుబోతు నియోజకవర్గంగా నిలబెట్టారని మండిపడ్డారు. 20 రోజుల్లో రూ.300 కోట్ల మద్యం తాగించారని ఆరోపించారు. చుక్క మందు పోయకుండా కాంగ్రెస్‌ 24వేల ఓట్లు పొందడం గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టేయడానికి బీజేపీ జాతీయస్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు తిష్ట వేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. 

ఈసీ అవసరం తేలిపోయింది!
తెలంగాణలో కాంగ్రెస్‌ ఖతం అయిందని మోదీ ప్రకటించడం దిగజారుడుకు పరాకాష్ట అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఓటమిని సమీక్షించుకోకుండా కాంగ్రెస్‌ సఫా అయిందని మోదీ సంబరపడుతున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ మిత్రులే అని మోదీ ప్రకటనతో మరో సారి నిరూపితమైంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌లది మిత్రభేదమే.. శత్రుభేదం కాదు. దేశానికి ఎన్నికల సంఘం అవసరం లేదని మును గోడు ఉప ఎన్నికతో తేలిపోయింది’ అని పేర్కొన్నారు.

మునుగోడు ఫలితాలపై తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిది కాదని, ఏఐసీసీ ఆదేశాల ప్రకారం టీపీసీసీ ముందుకెళ్తుందన్నారు. గవర్నర్‌ సందేహా లను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అదే సమయంలో ప్రతీది గవ ర్నర్‌ రాజకీయ కోణంలో చూడాల్సిన అవస రంలేదని పేర్కొన్నారు. పోలీసులు రహస్య కెమెరాలతో చిత్రీకరించిన ఫాంహౌజ్‌ వీడి యోలు ప్రగతిభవన్‌లో ఎందుకున్నాయని ప్రశ్నించారు.

తెలంగాణలో భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ను ప్రజలు అక్కున చేర్చు కున్నారని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ యాత్ర తో రాహుల్‌ నూతన శకానికి తెర లేపారని, దేశం ప్రమాదకర స్థితిలోకి పోతున్న సమ యంలో రాహుల్‌ భరోసాగా కనిపించారన్నా రు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మల్లు రవి, అంజన్‌కుమార్‌ యాదవ్, షబ్బీర్‌ అలీ, ఒబేదుల్లా కొత్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: నా ఫోన్లూ ట్యాపింగ్.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు