బీజేపీ, టీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలు

3 Jan, 2022 04:39 IST|Sakshi

హిమాయత్‌నగర్‌:రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తెర వెనుక స్నేహం చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ ఎంఆర్‌జీ వినోద్‌ రెడ్డి విమర్శించారు. హిమాయత్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించినా ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు.

తండ్రితో తిట్లు తింటూ.. కొడుకు కేటీఆర్‌ను పొగుడుతూ తన స్నేహ బంధాన్ని కిషన్‌రెడ్డి బహిర్గతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి పదవి పోయాక టీఆర్‌ఎస్‌ బండారాలు, అవినీతిని బయట పెడతానంటూ ప్రగల్భాలు పలికిన ఈటల రాజేందర్‌ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు 

మరిన్ని వార్తలు