పార్టీలో ఇంటి దొంగలను వదిలిపెట్టేది లేదు: రేవంత్‌ రెడ్డి

12 Jul, 2021 17:50 IST|Sakshi

కౌశిక్‌ రెడ్డిపై బహిష్కరణ వేటు

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కౌశిక్‌ రెడ్డిపై బహిష్కరణ వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా టీపీసీసీ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి, కౌశిక్‌ రెడ్డి రాజీనామాపై స్పందించారు. టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై కౌశిక్‌ రెడ్డి కోవర్ట్‌గా మారారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. నెలాఖరు వరకు కాంగ్రెస్‌ ఇంటి దొంగలకు డెడ్‌లైన్‌ విధించారు రేవంత్‌ రెడ్డి. 

ఇక కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు తనకు సహకరించ లేదని.. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పదవులిస్తున్నారని కౌశిక్‌ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. 50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్‌ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యారని కౌశిక్‌ రెడ్డి ఆరోపించారు. సీనియర్లను కాదని రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం తనను బాధించిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ కష్టం అని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు