మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై రేవంత్‌ సంచలన ఆరోపణలు

30 Jul, 2023 13:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఛాన్స్‌ దొరికిన ప్రతీసారీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై హస్తం నేతలు తీవ్ర ఆరోపణలు, విమ‍ర్శలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. 

కాగా, రేవంత్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ సర్కార్‌ తొమ్మిదేళ్ల పాలనలో పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ భూకబ్జాలకు పాల్పడుతున్నారు. వక్ఫ్‌ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అలంపూర్‌ అభివృద్ధి శూన్యం. కేసీఆర్‌ చేతిలో పాలమూరు జిల్లా మోసపోయింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసేది కాంగ్రెస్‌ పార్టీనే. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 14కి 14 సీట్లు కాంగ్రెస్‌ను గెలిపించండి. ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీదే అని హామీ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: ‘కవిత లిక్కర్‌ స్కాంపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేశారు’

మరిన్ని వార్తలు