తృణమూల్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్‌

15 Mar, 2022 19:44 IST|Sakshi
ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బెంగాల్‌లో వివాదాన్ని రేకెత్తిస్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొన్న తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి బిహార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కోల్‌కతాలోని బుక్‌ ఫెయిర్‌ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో టీఎంసీ ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి ప్రసంగిస్తూ.. ‘మీలో బెంగాలీ రక్తం ప్రవహిస్తే, ఖుదీరామ్, నేతాజీ(సుభాష్ చంద్రబోస్)ల రక్తం ప్రవహిస్తే.. మాతృభాషను, మాతృభూమిని ప్రేమిస్తే.. ఒక బీహార్ వ్యక్తి వంద వ్యాధులతో సమానం’ అని గట్టిగా అరవాలని వ్యాఖ్యానించారు. బెంగాలీలకు వ్యాధులు వద్దని, బెంగాల్‌ను వ్యాధి రహితంగా మార్చాలని పేర్కొన్నారు. 
 
తృణమూల్‌ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మాట్లాడిన వీడియో తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ యూపీ, బిహారిలు లేని పశ్చిమ బెంగాల్‌గా మార్చాలని అన్నారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మొదటిసారిగా 2021 బెంగాల్ ఎన్నికల్లో హుగ్లీ నుంచి గెలిచారు.

మరిన్ని వార్తలు