Abhishek Banerjee: మూడోసారి ఈడీ సమన్లు

11 Sep, 2021 15:35 IST|Sakshi
అభిషేక్‌ బెనర్జీ(ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21 న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ  ఆదేశించింది. మనీ లాండరింగ్‌ కేసులో అభిషేక్‌కు సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి.

బొగ్గు అక్రమ రవాణా కేసులో విచారణకు బెనర్జీ శుక్రవారం హాజరు కావాల్సి ఉంది  కానీ సమయం తక్కువగా ఉందంటూ అభిషేక్‌ బెనర్జీ హాజరు కాలేదు. దాంతో ఈ నెల 21 న హాజరుకావాలని మరోసారి సమన్లు ఇచ్చింది. అలాగే సెప్టెంబరు 1న  విచారణకు హాజరు కావాలని అభిషేక్ భార్య రుజిరాను ఈడీ సమన్లు జారీచేసింది. అయితే కోవిడ్‌ పరిస్థితులు కారణంగా చిన్నపిల్లలతో తాను  ఢిల్లీకి కాలేనని, దీనికి బదులుగా ఆమె కోల్‌కతా ఇంటిలో ఆమెను ప్రశ్నించాలని ఈడీని కోరారు.

సోమవారం (సెప్టెంబర్ 6) ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్‌లో ఈడీ అధికారులు అభిషేక్ బెనర్జీని ఎనిమిది గంటలకు పైగా విచారించారు. కుటుంబ సభ్యులతో సంబంధమున్న రెండు సంస్థలు అందుకున్న లెక్కకు మించిన డబ్బు గురించి ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విషయంలో పూర్తి సమాచారాన్ని అందించడంలో బెనర్జీని విఫలమైనట్టు తెలుస్తోంది.బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన నగదు విషయంలో వినయ్ మిశ్రా కీలక పాత్ర పోషించారని ఈడీ ఆ రోపిస్తోంది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడైన టీఎంసీ యువనేత వినయ్ మిశ్రాతో ఉన్న సంబంధాలపై బెనర్జీని సోమవారం ప్రశ్నించగా ఈ ఆరోపణలన్నింటిని  తోసిపుచ్చినట్టు  తెలుస్తోంది.

మరోవైపు ఈశాన్య రాష్ట్రంపై పట్టు  సాధించేందుకు  తృణమూల్ కాంగ్రెస్  భారీ కసరత్తే  చేస్తోంది.  2023 లో అసెంబ్లీ ఎన్నికలే లక్క్ష్యంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ  రానున‍్న  బుధవారం (సెప్టెంబరు 15 ) త్రిపురలోని అగర్తలాలో రోడ్‌షో నిర్వహించ నున్నారని  టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్  వెల్లడించారు.

మరిన్ని వార్తలు