ఆ వర్గం బలంగా ఉంది.. నాకు టికెట్ ఇస్తే గెలుస్తా: బూర నర్సయ్య గౌడ్‌

సాక్షి, నల్గొండ: టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కొందరు టీఆర్‌ఎస్ నేతలకు కామన్‌ సెన్స్ లేదని మండిపడ్డారు. మునుగోడులో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వడంలేదన్నారు.

బీసీ అనే కాకుండా పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు నర్సయ్య గౌడ్ చెప్పారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గం బలంగా ఉందని, ఆ ఈక్వేషన్స్‌తోనే  టికెట్ ఆశిస్తున్నట్లు చెప్పారు. బలమైన బీసీ నేతనని తెలిసినా తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికను మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి చూస్తున్నారని, ఎందుకు సమాచారం ఇవ్వడం లేదో ఆయన్నే అడగాలని పేర్కొన్నారు.

ఎవరికి టికెట్ వచ్చిన ఈ ప్రాంతం అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తాన్నారు.మునుగోడుఎన్నికపై దేశం మొత్తం చర్చ జరగుతోందని, సర్వేలపరంగా టీఆర్‌ఎసే గెలుస్తుందని చెప్పారు. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ ముఖ చిత్రం మీదే ఈ ఎన్నిక ఉండబోతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో లాభియింగ్ నడవదని, ముఖ్యమంత్రి నిర్ణయమే తుది నిర్ణయని వెల్లడించారు. 

'మునుగోడు పేరులొనే గోడు ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. మునుగోడును కేసీఆర్ దత్తత తీసుకునే అవకాశం ఉంది.రాష్ట్రంలో కొత్తగా 33 గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. మునుగోడు కు జూనియర్ కళాశాల లేదు. గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకోవాలి. మునుగోడు నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. నాకు పదవులు ముఖ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాం. ఎవరు చెప్పిన చెప్పకున్నా ముఖ్యమంత్రి దిశానిర్దేశంతోనే పని చేస్తా' అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
చదవండి: ఆ అవకాశం ఎవరికో? పోటీలో రఘునందన్ రావు, ఈటల

Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు