రాహుల్‌ వీడియోపై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు.. విమర్శలపై జగ్గారెడ్డి ఘాటు స్పందన

3 May, 2022 14:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌లో ఉన్న పర్సనల్‌ వీడియో ఒకటి రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నేపాల్‌ ఖాట్మాండులో ఓ వివాహ వేడుకకు హాజరైన రాహుల్‌.. పబ్‌లో ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఈ తరుణంలో.. తెలంగాణలో ఆయన టూర్‌ దగ్గరపడుతున్న వేళ.. ఈ వీడియోను విమర్శనాస్త్రంగా చేసుకుంది టీఆర్‌ఎస్‌. 

‘‘ఓయూ వెళ్లి నైట్‌ క్లబ్‌లో పార్టీ గురించి చెప్తారా? అంతకు మించి ఏం మాట్లాడతారు? రాహుల్ ఓయూకి వస్తే విద్యార్థులు చెడిపోతారు’’ అంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ సెటైర్లు వేశారు. అటు గతంలో కాంగ్రెస్‌ పాలన.. ఇటు బీజేపీ పాలన దేశాన్ని నాశనం చేశాయంటూ విమర్శించారు.  ఇక రాహుల్‌ పర్యటనకు అనుమతుల విషయంలో ఓయూ వీసీదే తుది నిర్ణయమని మంత్రి ఎర్రబెల్లి మంగళవారం మీడియా సమక్షంలో స్పష్టం చేశారు.  

తప్పేముంది?: జగ్గారెడ్డి
ఇదిలా ఉండగా.. రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోపై వస్తున్న విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వెళ్తే తప్పేంటని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఫంక్షన్ పోతే తప్పేంటి?. పెళ్లికి వెళ్తే రాజకీయం చేయడం చీప్‌ ట్రిక్స్‌. కావాలని బురద చల్లుతున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ వాళ్లకు కామన్‌ సెన్స్‌ లేదా? మీ నాయకుల వెనకాల కెమెరాలు పెట్టి చూడాలా? ఏం చేస్తున్నారో. టీఆర్‌ఎస్‌ నేతలకు హయత్‌ హోటల్స్‌లో సెపరేట్‌ రూల్స్‌ ఉన్నాయి. బీజేపీ నాయకులకు కూడా సూట్‌ రూమ్స్‌ ఉన్నాయి. వీటన్నింటిని ఏమనాలి? మరి అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు.

చదవండి: రాహుల్‌ నైట్‌ క్లబ్‌ వీడియో కాంగ్రెస్‌ స్పందన ఇది!

మరిన్ని వార్తలు