Clash Over Shivaji Statue: బోధన్ అల్ల‌ర్ల కేసులో కీల‌క మ‌లుపు.. విగ్రహ వివాదంలో అధికార పార్టీ నేత

24 Mar, 2022 08:37 IST|Sakshi
బోధన్‌ అల్లర్లు, కౌన్సిలర్‌ శరత్‌రెడ్డి

సాక్షి, నిజామాబాద్‌: బోధన్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు గోపికిషన్‌తో పాటు బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పద్మా భర్త అధికార పార్టీ కౌన్సిలర్‌ శరత్‌రెడ్డి ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు విచారణతో పాటు ఇంటెలిజన్స్‌ వర్గాల ఆరాలో తేలినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. శరత్‌రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

శివాజీ విగ్రహం కొనుగోలు చేయడానికి శివసేన జిల్లా అధ్యక్షుడు గోపికిషన్‌కు కౌన్సిలర్‌ సహకరించినట్లు తెలిసింది. కొనుగోలు చేసిన విగ్రహాన్ని శరత్‌రెడ్డి రైస్‌మిల్‌ వద్ద ఉంచి, శనివారం అర్ధరాత్రి గోపి అక్కడి నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఏ1 గా ఉన్న గోపికిషన్‌ను రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. అలాగే పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాతో పాటు పలు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు పికెట్‌ కొనసాగుతోంది.
చదవండి: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం..

మరిన్ని వార్తలు