పల్లెల్లో భేటీలతో ఏకతాటిపైకి.. ‘మునుగోడు’పై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక వ‍్యూహం

15 Sep, 2022 02:03 IST|Sakshi

మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ ప్రత్యేక వ్యూహం

క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలు అంచనా వేసే పనిలో నిమగ్నం

ఇతర పార్టీల నుంచి చేరికలపైనా మండల ఇన్‌చార్జీల దృష్టి

ఇప్పటికే 30 మందికి పైగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గులాబీ గూటికి

జాతీయ సమైక్యత వేడుకలు ముగిసిన తర్వాత మునుగోడుపైనే ఫోకస్‌

షెడ్యూల్‌ వెలువడిన తర్వాత చండూరులో సీఎం బహిరంగ సభ

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. గ్రామాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలా లను అంచనా వేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితు ల్లోనూ విజయం సాధించేలా ఒక వైపు పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపేందుకు కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇన్‌చార్జీలను నియమించిన అధికార పార్టీ, త్వరలో రెండు గ్రామాలకు ఒకరు చొప్పున ముఖ్య నేతలకు బాధ్యతలు అప్ప గించనుంది. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువ డిన తర్వాత చండూరు కేంద్రంగా టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. 

రాజగోపాల్‌ రాజీనామా వార్తలతోనే అప్రమత్తం
వాస్తవానికి మునుగోడు అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తా రనే సంకేతాలు వెలువడిన సమయంలోనే అధికార పార్టీ అప్రమత్తమై చేరికలపై దృష్టి పెట్టింది. రాజ్‌గోపాల్‌ రాజీనామా మొదలు కుని ఇప్పటివరకు, కాంగ్రెస్‌ సహా వివిధ పా ర్టీల  నుంచి 30మందికి పైగా ఎంపీటీసీ స భ్యులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు టీఆర్‌ ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా స్రవంతి పేరు ఖరారు కావడంతో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు పార్టీలో చేరే అవకా శముందని టీఆర్‌ఎస్‌ లెక్కలు వేస్తోంది.  

ఇప్పటికే రంగంలో మండల ఇన్‌చార్జీలు
ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఇద్దరేసి చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్య తలు అప్పగించారు. ఎమ్మెల్సీ, ఉమ్మడి నల్ల గొండ జిల్లా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావు పార్టీ యంత్రాంగాన్ని సమ న్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తు న్నారు. ఇన్‌చార్జీలు గ్రామాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల బలాబలాలు, సామాజికవర్గాల వారీ గా ఓటర్ల వివరాలు, గ్రామ రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా పార్టీ నేతల నడుమ విభేదాలు సరిదిద్దడం, ఇతర పార్టీల నుంచి చేరికలకు ప్రయత్నించడం వంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

త్వరలో 90 యూనిట్లు.. ముఖ్య నేతలందరికీ బాధ్యతలు 
తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ముగిసిన తర్వాత మునుగోడును 90 యూని ట్లుగా విభజించి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కీలక నేతలను ఇన్‌చార్జీలుగా రంగంలోకి దించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇప్ప టికే ఏ యూనిట్‌కు ఎవరు ఇన్‌చార్జిగా వ్యవ హరిస్తారో పేర్కొంటూ జాబితాను రూపొందించారు. 70 మంది ఎమ్మెల్యేలు, మరో 20 మంది ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు యూనిట్‌ ఇన్‌చార్జీలుగా వ్యవహ రిస్తారు. ఇలావుండగా గత నెల 20న మును గోడు నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్‌ బహి రంగ సభ నిర్వహించిన టీఆర్‌ఎస్‌.. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన తర్వాత చండూ రులో సభ నిర్వహించాలని నిర్ణయించింది. 

అభ్యర్థిగా కూసుకుంట్ల ఖాయం?
బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు కాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తుండటంతో.. అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ వంటి నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయగా, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు స్థానికంగా మరికొందరు నేతలు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే కూసుకుంట్ల అభ్యర్థిత్వం ఖాయమైనట్టేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్‌’!

మరిన్ని వార్తలు