టీఆర్‌ఎస్‌కు మంత్రి ఎర్రబెల్లి సోదరుడు గుడ్‌బై! బీజేపీలోకి ప్రదీప్‌రావు?

3 Aug, 2022 07:46 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, టీఆర్‌ఎస్‌ పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీ తీర్థం పుచ్చు­కోనున్నట్లు తెలిసింది. ఇటీవల హుజూరాబాద్‌లో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యాక.. వరంగల్‌ తూర్పు బీజేపీ నేతలతోనూ ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా ధ్రువీకరించడంతో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చేరిక ఇక లాంఛనమేనని తెలుస్తోంది.

రెండు వారాలుగా ఆయన అనుచరులు ‘అన్న బీజేపీలోకి వెళ్తున్నాడని’ వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టుకోవడంతోపాటు కలిసిన వారితో చర్చించడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీనిపై ప్రదీప్‌రావు బుధవారం వరంగల్‌లో తన అనుచరులతో సమావేశం కానున్నారని సమాచారం. కాగా, పార్టీ మారడంపై ఆయన ఎక్కడా అధికారికంగా మాట్లాడలేదు.
చదవండి: కేటీఆర్‌ కోసం సీనియర్లను కేసీఆర్‌ తొక్కేస్తుండు.. టీఆర్‌ఎస్‌కు రాజయ్య గుడ్‌బై

మరిన్ని వార్తలు