రేవంత్‌ది టెంట్, అరవింద్‌ది స్టంట్‌ రాజకీయం 

21 Oct, 2021 10:12 IST|Sakshi
ఫైల్ ఫోటో

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ రాష్ట్రంలో నాన్సెన్స్‌ రాజకీయాలు చేస్తూ న్యూసెన్స్‌ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్మూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి టెంట్‌.., అరవింద్‌ స్టంట్‌ రాజకీయాలు తెలంగాణలో నడవబోవని, రేవంత్‌రెడ్డి కేవలం తెలంగాణకే కాకుండా కాంగ్రెస్‌ పారీ్టకి కూడా దుఖఃదాయకుడని విమర్శించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్‌ ఉపఎన్నికలో తేల్చుకోకుండా కేటీఆర్‌ను బహిరంగ చర్చకు రావాలని రేవంత్‌రెడ్డి సవాళ్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  

మీరా మాకు నీతులు చెప్పేది: చింతల 
సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ అవకాశవాదంతో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు ఇలా అన్ని పారీ్టలతో అంటకాగిన టీఆర్‌ఎస్‌ నేతలా తమకు నీతులు చెప్పేది? అని  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ నేతలను ఇప్పుడు ఎవరూ నమ్మే పరిస్థితిలేదన్నారు. అన్ని ఇబ్బందుల్ని అధిగమించి మోదీ సర్కార్‌ దేశంలో వందకోట్ల డోస్‌ల కరోనా టీకాలకు చేరువైందని, ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ సెంటర్లలో వైద్య సిబ్బందిని సన్మానించాలని బీజేపీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు