మునుగోడు ఉపఎన్నికపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

10 Aug, 2022 14:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్గొండ టీఆర్‌ఎస్‌కు కంచుకోట అని, మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం మాదేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సందర్భంగా దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హై స్కూల్‌లో వన మహోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో మా ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి ఆగలేదు. బిహార్‌ రాజకీయాలను యావత్‌ దేశం గమనిస్తోంది. బీజేపీ బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. మునుగోడు ఉప ఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చెప్తుంది. నాగార్జున సాగర్, హుజుర్ నగర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హేమహేమీలను ఓడగొట్టింది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 

చదవండి: (కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న పాల్వాయి స్రవంతి ఆడియో)

మరిన్ని వార్తలు