ముందస్తు ఎన్నికలకు వెళ్లం: సీఎం కేసీఆర్‌

17 Oct, 2021 18:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్‌ చర్చించారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. హుజరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హుజరాబాద్‌లో సభ నిర్వహించడానికి సమావేశంలో నిర్ణయించారు. (చదవండి: టీఆర్‌ఎస్‌ దూకుడు..

హుజురాబాద్‌లో విజయం మనదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఇంకా రెండేళ్లు ఉంది. అన్ని పనులు చేసుకుందామని కేసీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్‌లో ప్రజాగర్జన సభ నిర్వహించాలని సీఎం సూచించారు. వరంగల్‌ సభపై కేటీఆర్‌ అధ్యక్షతన నియోజకవర్గాలవారీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
చదవండి: టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్లు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు