ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి?: రంజిత్‌రెడ్డి

6 Nov, 2022 13:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే బీజేపీ నాయకులు ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడుతుండటాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తప్పుపట్టారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగానే జరుగుతోందని తెలిపారు. బీజేపీకి తొందరపాటు ఎందుకు?. ఈసీ ఎవరి చేతిలో ఉంటుంది?. ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.

'కౌంటింగ్‌కు కేంద్రం నుంచి అబ్జర్వర్‌ వస్తారు. వాళ్ల ఆధీనంలోనే కౌంటింగ్‌ జరుగుతుంది. బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా, ఎంత మందు పోసినా ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం. బీజేపీ నాయకులు అనవసరంగా మాట్లాడుతున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు బీజేపీ నేతలు ఆగలేరా?. ఖర్చు పెట్టి ఓడిపోతున్నామనే భయంలో ఏదేదో మాట్లాడుతున్నారని' టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. 

చదవండి: (Munugode Results: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి: వికాస్‌రాజ్‌)

మరిన్ని వార్తలు