మంత్రుల ముందు ‘ఈటల’ గడియారాలు ధ్వంసం

5 Sep, 2021 18:26 IST|Sakshi

జమ్మికుట సభకు హాజరైన మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌

ఈటల ఇచ్చారని పేర్కొన్న యువకులు

సాక్షి, హుజురాబాద్‌: జహీరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట సభలో మంత్రులు హరీశ్‌ రావు, కొప్పుల ఈశ్వర్‌ ఎదుట కొందరు యువకులు గడియారాలు ధ్వంసం చేశారు. ఈటల రాజేందర్ ఇచ్చినవాటిగా పేర్కొంటున్న గడియారాలను ఆదివారం పగులగొట్టారు. జమ్మికుంటలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ యువ నాయకులు వేదికపైకి వచ్చారు. ఈటల రాజేందర్‌ ప్రజలకు పంపిణీ చేస్తున్నారని గడియారాలు, గొడుగులు తీసుకువచ్చారు. గడియారాన్ని నేలకేసి కొట్టాడు.

గొడుగులను చింపేశాడు. ఇవి ఆర్ధిక భరోసానిస్తాయా? అని ప్రశ్నించారు. దళిత వాడల్లో గడియారాలు, గొడుగులు పంచాలని ఈటల చెప్పాడని అయితే తాము నిరాకరించినట్లు యువకులు ఆరోపించారు. అతడి చర్యను చూస్తూ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌ రెడ్డి పగలబడి నవ్వుకున్నారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.

చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్‌ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక

చదవండి: రెచ్చిపోయిన ఉగ్రవాదులు: పోలీస్‌ శిబిరంపై బాంబు దాడి

మరిన్ని వార్తలు