ఎల్‌. రమణ నాకు మంచి స్నేహితుడు: కేసీఆర్‌

16 Jul, 2021 15:51 IST|Sakshi

ఎల్‌ రమణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ జూలై 12న టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎల్‌.రమణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఎల్‌.రమణ నాకు మంచి స్నేహితుడు. తనకు మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది. ఎల్‌.రమణ తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తారు. చేనేత వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కావాలి. చేనేతలను బాధల నుంచి విముక్తి కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు