-

తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం

28 Nov, 2023 15:12 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఓటర్ల కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాంధీ సందేశం విడుదల చేశారు. ప్రియమైన సోదరీసోదరీమణులారా.. అంటూ భావోద్వేగపూరితంగా తన సందేశం పంపించారామె.

‘‘తెలంగాణ ప్రజల మధ్యకి రాలేకపోయాను. కానీ, ప్రజల హృదయాలకు మాత్రం చాలా దగ్గరయ్యాను. నన్ను సోనియమ్మ అని ఆప్యాయంగా పిలిచి గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలి. తెలంగాణ అమరవీరుల కల నెరవేరాలి. నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకోండి’’ అని వీడియో సందేశం ద్వారా కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారామె. 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

మరిన్ని వార్తలు