కరోనాపై కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ట్వీట్ల రగడ

18 May, 2021 14:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సెకండ్‌ వేవ్‌ కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చి భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కరోనా అంశంపై కాంగ్రెస్‌, బీజేపీ మధ్య తీవ్ర ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనారోపణలు చేస్తున్నారు. కోవిడ్ సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు మీదుగా ‘మోదీ స్ట్రెయిన్‌’ అని కాంగ్రెస్‌ పేరు సృష్టించింది. ఇక దీంతోపాటు కరోనా వ్యాప్తికి కుంభమేళా కారణంగా చెబుతూ ‘సూపర్‌ స్ప్రెడర్‌ కుంభ్‌’ అని కాంగ్రెస్‌ కొత్త నినాదం తీసుకొచ్చింది. 

దీనిపై ప్రతిగా బీజేపీ స్పందించింది. ప్రధాని మోదీ పేరును నాశనం చేయడానికి కాంగ్రెస్ ‘టూల్‌కిట్’ రూపొందించినట్లు బీజేపీ ఆరోపించింది. టూల్‌కిట్ అని పిలవబడే పార్టీ కార్యకర్తలను మోదీ పేరు చెడగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలని కాంగ్రెస్‌ చెబుతోందని పేర్కొంది. కరోనా వైరస్ సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీ తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుందని విమర్శించింది. కాంగ్రెస్ ఈ ఆరోపణను కొట్టిపారేసింది. బీజేపీ ప్రచారం చేసిన నకిలీ కథనం అని పేర్కొంది. అలాంటి టూల్‌కిట్‌ అంశాన్ని ఖండించింది. కేంద్ర మంత్రి మురళీధరన్‌, ఎన్‌యూసీఐ నాయకుడు సంబిత్‌ పాత్ర తదితరుల మధ్య ఈ ట్వీట్ల రగడ కొనసాగుతోంది. 
 

మరిన్ని వార్తలు