మహారాష్ట్రలో మరో ట్విస్ట్‌.. పవార్‌, ఉ‍ద్దవ్‌కు బిగ్‌ షాక్‌!

28 Apr, 2023 12:29 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో మరోసారి పొలిటికల్‌ వాతావరణం హీటెక్కింది. షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే, పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఉద్దవ్‌ వర్గం శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)కి చెందిన 33 మంది ఎమ్మెల్యే తమతో టచ్‌లో ఉన్నారని బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు పొలిటికల్‌ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

వివరాల ప్రకారం.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్‌లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు షిండే గ్రూపుతో టచ్‌లో ఉన్నారని మంత్రి ఉదయ్ సమంత్ పేర్కొన్నారు. అలాగే, మహాబలేశ్వర్‌లోని సీఎం షిండేతో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రహస్యంగా సమావేశమయ్యారని అన్నారు.  కాగా, ఉదయ్‌ సమంత్‌ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. సీఎంకు మద్దతు తెలిపేందుకు రెడీ ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దవ్‌ వర్గం అప్రమత్తమైనట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా..  ఖర్ఘర్ ఘటన తర్వాత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఆ పదవి నుంచి తప్పిస్తారనే చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, షిండే వ్యవహార శైలి వల్ల బీజేపీ మంత్రులు, నాయకుల్లో ఆగ్రహం పెరుగుతోందని, సీఎం పలు ఫైళ్లను క్లియర్ చేయడం లేదని సమాచారం. బీజేపీ రాష్ట్ర నేతలు హైకమాండ్‌కు సమాచారం అందించినప్పటికీ, కర్ణాటక ఎన్నికల వరకు వేచి ఉండాలని రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌.. బీజేపీ నేతలతో టచ్‌లోకి వచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో, అజిత్ పవార్ మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అజిత్‌ పవార్‌ స్పందించారు. తన చివరి శ్వాస వరకు ఎన్సీపీలోనే ఉంటానని పవార్ స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: సినీ ఫక్కీలో బీజేపీ నేత హత్య

మరిన్ని వార్తలు