‘దేవాలయాలు రీఓపెన్‌ చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయొద్దు’

5 Sep, 2021 20:10 IST|Sakshi
ఉద్ధవ్ ఠాక్రే (ఫైల్‌ ఫోటో)

మహారాష్ట్ర  సీఎం ఉద్ధవ్ ఠాక్రే

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అదుపులోకి రాకముందే దేవాలయాలను పున: ప్రారంభించాలని  ప్రతిపక్షాలు ఆందోళన చేయొద్దని సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ఆయన ఆదివారం కరోనా నేపథ్యంలో డాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆలయాల పున: ప్రారంభంపై ప్రతిపక్షాలు నిరసన చేయొద్దన్నారు. గత ఏడాది పండగల అనంతరం కోవిడ్‌ కేసుల సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు. ఎక్కువ మంది ప్రజలు ఓకేచోట గుమిగూడవద్దని, తప్పనిసరిగా ముఖానికి మాస్క్‌ ధరించాలని సూచించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవాళ్లు కూడా మాస్క్‌ ధరించాలని పేర్కొన్నారు.

చదవండి: రైతుల ఆందోళన: ఎంపీ వరుణ్‌ గాంధీ మద్దతు

రాష్ట్రంలో వైద్యానికి సంబంధించి మౌళిక సదుపాయాలను పెంచామని సీఎం చెప్పారు. ప్రజలు డెగ్యూ, మలేరియా వ్యాధుల బారినపడుతున్నారని, వారి వ్యాధి లక్షణాల్లో తేడాలు కనిపిస్తున్నాయని చెప్పారు. డెగ్యూ, మలేరియా బారినపడినవారు కూడా కోవిడ్‌ నిర్థారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా మూడో వేవ్‌ రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల్లో బీజేపీ, మహరాష్ట్ర నవనిర్మాణ్‌ సేన పార్టీలను సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తావించపోవడం గమనార్హం.

చదవండి: తొలి బస్‌ డ్రైవర్‌: ఆమె ప్రత్యేకత ఇదే..
 

మరిన్ని వార్తలు