చూస్తూ ఉండండి.. మళ్లీ గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయి 

11 Sep, 2023 21:30 IST|Sakshi

ముంబై: అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు జనవరి నెలాఖరుకల్లా పూర్తయ్యే అవకాశమన్నందున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉండగా రామాలయం ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతారని వారు తిరిగి వెళ్లే సమయంలో గోద్రా తరహా అల్లర్లు జరిగే అవకాశముందని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే.

అల్లర్లు జరుగుతాయి.. 
జల్గావ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఉద్ధవ్ ఠాక్రే వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న రామ మందిరం ప్రారంభోత్సవం గురించిన ప్రస్తావన చేశారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భక్తులు బస్సుల్లోనూ, రైళ్లలోనూ లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశముందని వారు తిరిగి వెళ్లే సమయంలో వారిపై దాడులు జరుగుతాయని దుండగులు రాళ్లు రువ్వుతారని అన్నారు. గోద్రా అల్లర్ల తరహాలోనే హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశముంటుందని హెచ్చరించారు. 

గోద్రా తరహాలోనే.. 
2022, ఫిబ్రవరిలో జరిగిన గోద్రా అల్లర్లు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టింఛాయా అందరికి తెలిసిందే. ఈ హింసాకాండలో 58 మంది మృతి చెందగా ఎందరో గాయాల పాలయ్యారు. గోద్రా రైల్వేస్టేషన్లో ఉన్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌లకు నిప్పు పెట్టారు నిరసనకారులు. గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్ హైకోర్టు  మొత్తం 31 మందిని దోషులుగా నిర్ధారించగా 65 మందిని నిర్దోషులుగా ప్రకటించింది గుజరాత్ హైకోర్టు. గుజరాత్ హైకోర్టు నిర్ధారించిన తీర్పుపై సుప్రీంకోర్టులో చేసిన అప్పీల్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 

మీ తండ్రి ఆత్మకు క్షోభ..  
ఇదిలా ఉండగా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. నిన్ను చూసి మీ తండ్రి ఆత్మ క్షోభిస్తుందని.. నా బిడ్డకు ఎమైంది? ఎవరి ఆశీస్సులతో నా బిడ్డ రాజకీయంగా ఎదిగాడని అనుకుంటారని.. మీరు చూస్తే ఇండియా కూటమిలో చేరి నానాయాగీ చేస్తున్నారన్నారు. రామ జన్మభూమిపై మీ తండ్రిగారి ఆశీస్సులు ఉంటాయని మీ కూటమికి ఆ శ్రీరామచంద్రుడు కొంతైనా జ్ఞానమివ్వమని ప్రార్ధించమని కోరారు.    

నోరు విప్పరేం.. 
ఇక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రేను స్వార్ధపరుడని చెబుతూ తమిళనాడు నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాలా సాహెబ్ ఠాక్రే ఉండి ఉంటే మీ స్వార్ధాన్ని చూసి మనోవేదనకు గురయ్యేవారని వ్యాఖ్యానించారు. 

ఇది కూడా చదవండి: 'భారత్' 'ఇండియా' ఏ పేరైనా పర్వాలేదు 

మరిన్ని వార్తలు