హిందీపై అమిత్‌ షా సందేశం హాస్యాస్పదం

15 Sep, 2023 06:06 IST|Sakshi

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌  

చెన్నై: హిందీ భాష దేశంలోని ఇతర భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తోందని, అన్ని భాషలను, యాసలను గౌరవిస్తోందని ‘హిందీ దివస్‌’ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇచి్చన సందేశాన్ని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ గురువారం తప్పుపట్టారు.

హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అమిత్‌ షా సందేశం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఎలా ఏకం చేస్తుందని ఉదయనిధి స్టాలిన్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

మరిన్ని వార్తలు