Cabinet Reshuffle: 5 రాష్ట్రాలకే ప్రాధాన్యం?

6 Jul, 2021 15:34 IST|Sakshi

28 స్థానాలను భర్తీ చేసే అవకాశం

త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొనసాగుతుంది. జూలై 7న(బుధవారం) కేంద్ర కేబినెట్‌  పునర్వవ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. రేపు సా.5:30 నుంచి 6 గంటల మధ్య కేబినెట్‌ విస్తరణ జరుగనుంది.  తొలుత జూలై 7వ తేదీన కేబినెట్‌ పునర్వీవ్యవస్థీకరణ జరుగనున్నట్లు వార్తలు వచ్చినా, ఆ తర్వాత జూలై 8వ తేదీన కేబినెట్‌ విస్తరణ జరపాలని నిర్ణయించారు. కాగా, మళ్లీ ముందు అనుకున్న తేదీ ప్రకారం జూలై 7వ తేదీనే కేబినెట్‌ పునర్వవ్యవస్థీకరణకు మొగ్గు చూపారు. ఈ కేబినెట్‌లో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం దక్కనుంది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా శాఖల మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్‌లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 53 మందితోనే మంత్రివర్గం కార్యకలాపాలు కొనసాగిస్తుంది. మిగిలిన 28 స్థానాలను మరో రెండు రోజుల్లో భర్తీ చేసే అవకాశం ఉంది. 

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ముఖ్యనేతలతో భేటీ అయినట్లు తెలిసింది. కేబినెట్‌ విస్తరణ గురించి ఈ భేటీలో చర్చించనున్నారని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆశావాహుల జాబితాలో సీనియర్‌ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా, అసోం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, జేడీయూ నాయకులు ఆర్‌సీపీ సింగ్‌, లల్లన్‌ సింగ్‌ (బిహార్‌), అప్నా దళ్‌ నేత అనుప్రియ పాటిల్‌, పంకజ్‌ చౌదరి(యూపీ), కైలశ్‌ విజయవర్గీయ (మధ్యప్రదేశ్‌), నారాయణ రాణే (మహారాష్ట్ర), రీటా బహుగుణ జోషి, రామశంకర్‌ కథేరియా (యూపీ), పశుపతి పారస్‌, రాహుల్‌ కశ్వన్‌, చంద్రప్రకాశ్‌ జోషి (రాజస్థాన్‌) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు