తెలంగాణలో అవినీతి తారాస్థాయికి చేరింది.. కేంద్రమంత్రి సింధియా సంచలన ఆరోపణలు

29 Jul, 2022 16:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంద్రి జ్యోతిరాదిత్య సింధియా.  రాష్ట్రం తిరోగమనంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ సర్కార్ సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీ హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు.

అలాగే తెలంగాణలో అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని సింధియా ఆరోపించారు. తప్పు చేయనప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అంటే భయమెందుకు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొన్నారు సింధియా. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు సింధియా. గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆయనకు స్వాగతం పలికారు.


చదవండి: రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్‌లో ఉత్కంఠ

మరిన్ని వార్తలు