కేసీఆర్‌కు భయపడం: కిషన్‌రెడ్డి

7 Dec, 2021 16:34 IST|Sakshi

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ రాజకీయం

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, ఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు భయపడం అన్నారు. బీజేపీపై టీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు.

చదవండి: Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్‌ టెక్నిషియన్‌ నిర్వాకం 

‘‘‘హుజూరాబాద్ ఓటమి నుంచి బయట పడేందుకు లేని సమస్యను సృష్టించారు. ముందే ఒప్పందాలు చేసుకొని మళ్లీ సమస్య సృష్టిస్తున్నారు. రైతులకు మేము ఎప్పుడు నష్టం చేయం. ఈ సీజన్‌లో వచ్చే ప్రతి గింజ కొంటాం. కొనడానికి సిద్ధంగా ఉన్నా, 17 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వలేదు. ధర్నాలు చేసే బదులు వరి ధాన్యం సేకరించండి. కిసాన్ బచావో కాదు అది కేసీఆర్ బచావో నినాదాలు. ధాన్యం కొనుగోలు చేయమని  రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం బాధ్యత రహితం. ధాన్యం సేకరించకుంటే ఒక రూపాయికి కిలో బియ్యం పథకాన్ని మీరు రద్దు చేస్తారా?. రబీలో ముడిబియ్యం తీసుకుంటాం. బియ్యం ఎంత తీసుకుంటామనేది ఫిబ్రవరిలో  నిర్ణయిస్తాం. వానాకాలంలో ప్రతి ధాన్యం గింజ కొంటామని’’ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు