Kishan Reddy: కేసీఆర్‌.. డ్రామాలు ఆపాలి

14 Apr, 2022 03:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం తమ రాజకీయ డ్రామాలకు తెరదించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హితవు పలికారు. ధాన్యం సేకరణపై చేసినట్టు రాజకీయ డ్రామాలు ఇకపై చేయొద్దన్నారు. కేసీఆర్‌ వైఖరి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రజలు వీళ్ల డ్రామాలకు తెరవేస్తారని హెచ్చ రించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగం గా ఢిల్లీలోని అశోకా హోటల్‌లో బుధవారం నిర్వ హించిన ‘అమృత్‌ సమాగమ్‌’కార్యక్రమంలో పాల్గొ న్న తర్వాత కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘ధాన్యం సేకరణలో మిగతా రాష్ట్ర ప్రభుత్వాల్లాగే కేసీఆర్‌ సర్కారు వ్యవహరించి ఉంటే హుందాగా ఉండేది. ధాన్యం సేకరణతో పాటు అనేక అంశాల్లో ప్రజలను మభ్యపెట్టేలా కేసీఆర్‌ రాజకీయ నాటకం ఆడుతున్నారు. రైతు దీక్షల పేరుతో రాజకీయ దీక్షలు చేశారు. ప్రతి గ్రామం, జిల్లా, చివరికి ఢిల్లీకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేసి లాభం పొందాలని చూశారు. కానీ రాష్ట్ర రైతులు కేసీఆర్‌ ఆందోళనల్లో ఎవరూ భాగస్వాములు కాలేదన్నారు. ధాన్యం సేకరణలో ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకొచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. 

75 పర్యాటక కేంద్రాల్లో యోగా వేడుకలు 
ఈ ఏడాది జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ప్రపంచంలోని వివిధ దేశాల్లోని 75 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 15న దేశం కోసం త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకునేలా ప్రతీ ఇంటిపైన జాతీయ జెండా ఎగరేయాలని దేశ ప్రజలను కోరారు. ఢిల్లీలో నిర్వహించిన ‘అమృత్‌ సమాగమ్‌’కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశాభివృద్ధిలో పాలుపంచుకున్న 14 మంది ప్రధానుల స్మారకంగా ప్రధానమంత్రి సంగ్రహాలయ పేరుతో ఏర్పాటుచేసిన మ్యూజియంను గురువారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారని చెప్పారు. 

మరిన్ని వార్తలు