ఎన్నికల హామీలు ఏమయ్యాయి? 

25 Sep, 2021 01:21 IST|Sakshi
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పాటిల్‌ 

సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన కేంద్రమంత్రి రావ్‌సాహెబ్‌ పాటిల్‌ 

ముస్తాబాద్‌/సిరిసిల్ల: గత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కేంద్ర గనులు, రైల్వే శాఖ సహాయమంత్రి రావ్‌సాహెబ్‌పాటిల్‌ ధన్వే డిమాండ్‌ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌ ఎక్కడ అని ప్రశ్నించారు. శుక్రవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు కేంద్రమంత్రి పాదయాత్రలో పాల్గొన్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు కేంద్రమిచ్చిన నిధులకు లెక్కలెందుకు చూపడంలేదని నిలదీశా రు. కాగా,వడ్లు కొనేదిలేదని, దొడ్డు వడ్లు వేయొ ద్దని సీఎం కేసీఆర్‌ రైతులను బెదిరిస్తే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగం గా రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో శుక్రవా రం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

మరిన్ని వార్తలు