రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు: అమెరికా

4 Feb, 2022 04:10 IST|Sakshi

సమర్థించడం లేదన్న అమెరికా

రాహుల్‌పై బీజేపీ విమర్శలు

సమర్థించుకున్న కాంగ్రెస్‌

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానాలు, నిర్ణయాలపై కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలను తాము సమర్థించబోమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌–చైనా ఒక్కటయ్యాయంటూ రాహుల్‌ గాంధీ లోక్‌సభలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. పాక్‌–చైనా బంధంపై మాట్లాడే విషయాన్ని ఆయా దేశాల ప్రజలకే వదిలేద్దామని నెడ్‌ ప్రైస్‌ పేర్కొన్నారు. అమెరికా, చైనాలలో స్నేహం కోసం దేన్ని ఎంచుకోవాలన్నది ప్రపంచ దేశాల ఇష్టమని చెప్పారు.

దేశానికి రాజా అనుకుంటున్నారు...
లోక్‌సభలో రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగంపై అధికార బీజేపీ మాటల దాడి కొనసాగిస్తోంది. ఆయన భారతదేశానికి ఇన్నాళ్లూ యువరాజులాగా ప్రవర్తిం చేవారని, తప్పుడు రాజును అనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం ఎద్దేవా చేశా రు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను అణచివేయడం, ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం రాహుల్‌ గాంధీ దృష్టిలో తప్పేనా? అని బీజేపీ అధికార ప్రతినిధి, బిహార్‌ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌ నిలదీశారు.

నిజాలే మాట్లాడారన్న కాంగ్రెస్‌
రెండు భారతదేశాలు అంటూ పార్లమెంట్‌లో ప్రసంగించిన రాహుల్‌ గాంధీని పలువురు కాంగ్రెస్‌ పార్టీ నేతలు సమర్థించారు. దేశానికి రెండు ముఖాలు ఉన్నాయని, ఒకటి ధనికం కాగా, మరొకటి నిరుపేద అని సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రెండింటి మధ్య అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాత్రమే రాహుల్‌ విమర్శించారని గుర్తుచేశారు. ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని పేర్కొన్నారు. రాహుల్‌ నిజాలే మాట్లాడారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాహుల్‌ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌ ఖండించారు.

సభా హక్కుల నోటీసు  
పార్లమెంట్‌ సభ్యులను, దేశ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం ధీకి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసును లోక్‌సభ సెక్రటేరియట్‌కు అందజేశారు. భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛ వెల్లడించే రాజ్యాంగబద్ధ హక్కు ప్రతి ఎంపీకి ఉన్నప్పటికీ ఈ విషయంలో మర్యాద పాటించాలని దూబే పేర్కొన్నారు. పార్లమెంట్‌ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి రాహుల్‌ చేసి న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. భారత్‌ను రాహుల్‌ ఒక దేశంగా పరిగణించకపోవడం బా ధాకరమని, రాహుల్‌ అసలు రాజ్యాంగ ప్రవేశికను చదివారా? అని ప్రశ్నించారు. ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించాలన్నారు.

మరిన్ని వార్తలు