బీజేపీ‍ రైతు వ్యతిరేక పార్టీ: ఉత్తమ్‌

31 Oct, 2020 11:53 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, సిద్ధిపేట: బీజేపీ రైతు వ్యతిరేక పార్టీగా నరేంద్ర మోదీ చరిత్రకు నాంది పలికారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శనివారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌  కార్యాలయంలో ఆ పార్టీ ‌ అగ్రనేతలు సత్యగ్రహ, ఉపవాస దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఆయన ఉన్నత ఉద్యోగం, వ్యాపారం వదులుకొని పోటీ చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావు తెలంగాణను దోచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం, బంధువుల పాలన నడుస్తుందని విమర్శలు గుప్పించారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో తిరిగామని, వారికి రావాల్సిన  బకాయిలు ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలో మద్యం, డబ్బు ప్రాభవం కొనసాగుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు