కేసీఆర్‌ మౌనం ఎందుకు?

2 Aug, 2020 03:30 IST|Sakshi
 ఉత్తమ్‌ను పరామర్శిస్తున్న కాంగ్రెస్‌ నేతలు టి.రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి తదితరులు 

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌

పోతిరెడ్డిపాడు విస్తరణ పూర్తయితే దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుంది

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు టీఎంసీల నీళ్ల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన సీఎం కేసీఆర్‌ పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని తీసుకెళ్తుంటే మౌనంగా ఎందుకు ఉంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. జూమ్‌ యాప్‌ ద్వారా శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మిస్తే తెలం గాణ 6 టీఎంసీ నీళ్లను నష్టపోతుందని చెప్పారు.

6 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేందుకు జీవో జారీ చేసినా కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రతిపాదన పూర్తయితే నాగార్జున సాగర్‌–పాలమూరు ఎత్తిపోతల–కల్వకుర్తి ప్రాజెక్టులకు చుక్క నీరు ఉండవని, దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ కోసం అక్కడి ప్రభుత్వం ఈనెల 11న టెండ ర్లు పిలుస్తున్నట్టు తెలుస్తోందని, ఆ ప్రక్రియ పూర్తి కావాలనే అపెక్స్‌ భేటీ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్‌ కోరారని ఆరోపించారు. 

ఉత్తమ్‌ మోకాలికి గాయం: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మోకాలికి గాయమైంది. ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడ్డారని, దీంతో మోకాలికి బలమైన గాయం తగిలిందని గాంధీభవన్‌ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఆయన 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపాయి. శనివారం మాజీ    ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి ఉత్తమ్‌ను కలిసి పరామర్శించారు.

మరిన్ని వార్తలు