రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్‌

6 Oct, 2020 16:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దుబ్బాక ఎన్నికకు సంబంధించి మంగళవారం వీడియో కాన్ఫరరెన్స్‌ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..' దుబ్బాక అభ్యర్థి పేరు హైకమాండ్ పరిశీలనలో ఉంది.. అభ్యర్థి పేరు రేపు ప్రకటిస్తాం. యావత్ కాంగ్రెస్ కుటుంబ ఎన్నికగా దుబ్బాక ఎన్నికను నేతలు సహకరించాలి.7 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి చోటుచేసుకుంది.సీఎం నుంచి వీఆర్వో వరకు ప్రతీ ఒక్కరూ దోచుకుంటున్నారు.కేసీఆర్ సీఎం అయ్యాక.. తెలంగాణను భ్రష్టు పట్టించాడు. ఎవరూ డబ్బు పంపిణీ చేసిన.. ఓట్లు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలి. (చదవండి : సోలీపేట సుజాత‌ను గెలిపిద్దాం : హరీష్ రావు)

తెలంగాణ అమరవీరులకు న్యాయం చేశాడా.. అన్యాయం చేశాడా అనేది ఈ ఎన్నికతో తేలిపోవాలి. దుబ్బాక ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే ఏ చేసేందుకైన సిద్ధం
గా ఉన్నాం. రేపటి నుంచి నేను దుబ్బాక లో ఉంటా. గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయించండి. ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ద్వారా ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాట ఇస్తున్న.. దయచేసి పైసలు కట్టొద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫ్రీగా చేస్తాం.'అని పేర్కొన్నారు. 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..' దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం నేతలందరూ కృషి చేయాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కీలకం. నేతలందరూ ఓటు నమోదును సీరియస్‌గా తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం డబ్బులు కొల్లగొట్టాలని చూస్తోంది.డబ్బులు చెల్లించవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలి. రెండున్నర ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తాం.' అంటూ తెలిపారు. (చదవండి : దుబ్బాక ఉప ఎన్నికలు: కోవిడ్‌ నిబంధనలు)

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. దౌల్తాబాద్ మండలంలో 8వ తేదీన ఘనంగా మీటింగ్ నిర్వహించనున్నాం. బేషజాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని నా విజ్ఞప్తి. 2023 ఎన్నికలకు దుబ్బాక ఎన్నిక నాంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి నాయకత్వం ఉంది. దుబ్బాకలో వచ్చే 15 రోజులు కష్టపడితే విజయం తధ్యం.నాకు కేటాయించిన ప్రాంతాల్లో ఇతర పార్టీల కంటే 5వందలు లేదా 1000 ఓట్లు అధికంగా తెచ్చే ప్రయత్నం చేస్తా. ' అంటూ వెల్లడించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు