గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. మూడు రోజులు సంతాప దినాలు..

26 Apr, 2023 16:58 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్ సాంఘీక సంక్షేమ, రవాణా శాఖ మంత్రి చందన్‌ రామ్ దాస్(63) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.  బగేశ్వర్ జిల్లా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.  ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం పుష్కర్‌ సింగ్ ధామీ తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. చందన్ రామ్ దాస్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

'నా కేబినెట్‌ మంత్రి హఠాన్మరణం విస్మయానికి గురి చేసింది. ఆయన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. సామాజిక సేవ, రాజకీయాల్లో ఆయన లోటు పూడ్చలేనిది.' అని ధామీ ట్వీట్ చేశారు.

కాగా.. మంత్రి మృతికి సంతాపంగా బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాపదినాలు ప్రకటించింది. చందన్ రామ్‌ దాస్ 2007 నుంచి వరసగా నాలుగు సార్లు బగేశ్వర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ధామీ కేబినెట్‌లోనే తొలిసారి ఆయనకు మంత్రి అవకాశం దక్కింది.
చదవండి: సీఎం ఇంటి రిపేర్ల కోసం రూ.45 కోట్లు..! మరి మోదీ రూ.8,400 కోట్ల విమానం సంగతేంటి..?

>
మరిన్ని వార్తలు