మహిళల్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు

16 Sep, 2022 06:30 IST|Sakshi

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

సాక్షి, అమరావతి: మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం తగదని ప్రతిపక్ష టీడీపీకి రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతిపై సోషల్‌ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె బుధవారం డీజీపీని కలిసి లేఖను అందజేయడం తెలిసిందే.

ఇదే విషయమై గురువారం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ప్రతినిధులు వాసిరెడ్డి పద్మను కలిసి వినతులు అందించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు అనేక ప్రాంతాలకు చెందిన మహిళా సంఘాలు ఎవరికి వారు విడివిడిగా సంతకాలతో వినతిపత్రాలు ఇచ్చారు.

వాటిని ఆమె డీజీపీ కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ గత ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ భారతి మాట్లాడిన మాటలను వక్రీకరించి ఒక వర్గం సోషల్‌ మీడియాలో చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన ఆధారాలను డీజీపీకి సమర్పించినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు