ఆలయాలపై కుట్రలను ఛేదిద్దాం

19 Sep, 2020 05:41 IST|Sakshi

అధికారులకు మంత్రి వెలంపల్లి పిలుపు 

13 జిల్లాల అధికారులతో సమీక్ష 

సాక్షి, అమరావతి: దేవాలయాలను అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయ పార్టీల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆలయాలపై జరుగుతున్న ఈ కుట్రలను ఛేదిద్దామని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవదాయ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన ఆ శాఖ కమిషనర్‌ పి. అర్జునరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రి ఏమన్నారంటే.. 

► కొందరు పనిగట్టుకుని దేవాలయాలపై కుట్రలు చేస్తున్నారు. జిల్లాలో పనిచేసే అసిస్టెంట్‌ కమిషనర్‌లతో పాటు రీజనల్‌ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్, తమ పరిధిలోని గ్రామల్లో తరచూ పర్యటించి.. అక్కడ గ్రామ కమిటీలతో పాటు స్థానికులతో సమావేశమై వారి సూచనలను తెలుసుకుంటూ ఉండాలి.  
► దేవాలయాలు, రథాల భద్రత కోసం ఏర్పాటుచేసే సీసీ కెమెరాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు.  అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు