అమరావతిని మార్చడం లేదు

9 Aug, 2020 05:50 IST|Sakshi

మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నాం

మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): రాజధానిగా అమరావతిని మార్చడం లేదని, దీనికి అదనంగా మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

► అసమానతలకు తావు లేకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోంది. 
► రాష్ట్రంలో వికేంద్రీకరణతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. దాన్నే అమలు చేస్తున్నాం.
► కానీ చంద్రబాబు నిరంతరం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రకటనలు చేస్తూ మోసం చేస్తున్నారు. ఆర్డినెన్స్‌ వచ్చినప్పటి నుంచి యాగీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అమరావతిని తరలిస్తున్నామని మాయమాటలతో అందరినీ మోసపుచ్చుతున్నారు. ఆయన జీవితమంతా మోసం చేయడమే. 
► చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్‌ చూపించారు.. అభివృద్ధిని పట్టించుకోలేదు. వాస్తవ అభివృద్ధిని సీఎం వైఎస్‌ జగన్‌ చూపుతున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా