చంద్రబాబుది శశికళ శపథం

1 Dec, 2021 03:30 IST|Sakshi
మంత్రి వెలంపల్లి దంపతులకు ప్రసాదాలను అందిస్తున్న ఈవో లవన్న

అది నెరవేరదు: మంత్రి వెలంపల్లి

శ్రీశైలం టెంపుల్‌: ప్రతిపక్షనేత చంద్రబాబుది శశికళ శపథం లాంటిదని, అది నెరవేరదని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం శ్రీశైలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమానికి మల్లన్న ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరికీ మంచి జరిగేలా చూడాలని స్వామి అమ్మవార్లను కోరుకున్నానని తెలిపారు.

చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, కాని ఏదో జరిగినట్లు బాధ నటించి సానుభూతి కోసం ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ఇవన్నీ చేస్తున్నారని చంద్రబాబును విమర్శించారు. మంత్రి కుటుంబ సమేతంగా మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, శ్రీభ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు.  

మరిన్ని వార్తలు