ప్రభుత్వంపై బురద చల్లుతున్న చంద్రబాబు 

27 Jan, 2023 04:11 IST|Sakshi
తెనాలిలో వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి విడదల రజని. చిత్రంలో ఎమ్మెల్యే శివకుమార్‌

అధికారంలో ఉన్నప్పుడు పేదలకు వైద్యం గురించి ఆలోచించని చంద్రబాబు 

తెనాలిలో వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి విడదల రజిని  

తెనాలి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్ర­జ­­లకు మెరుగైన వైద్యం అందించాలని కనీసం ఆలోచించలేదని రాష్ట్ర వై­ద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి విడదల రజిని విమర్శించా­రు. గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్‌లో రూ.1.10 కోట్లతో నిర్మించిన వైఎస్సార్‌ పట్ట­ణ ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు.

అనంతరం స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. చంద్రబాబు అధికారం పోయాక.. ప్రజలకు మంచిచేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. లోకేశ్‌ యాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియదన్నారు. వారు అధికారంలో ఉన్న­ప్పు­డు ఎలా మోసం చేశారో ప్రజలకు తెలుసన్నారు.

జగనన్న ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్న ప్రజలు.. బాబు, లోకేశ్‌ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లే­రని చెప్పారు. రా­ష్ట్రంలోని జిల్లా ఆస్పత్రులు, ఏరియా వైద్యశాలలు, కమ్యూనిటీ సెంటర్లను ఆధునికీకరిస్తూ, గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్, పట్టణాల్లో అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలను ఏ­ర్పాటు చేస్తున్నట్టు వివరించారు.

వీటితోపాటు ప్రభుత్వం కిడ్నీ, క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లను నడుపుతోందని, అన్నీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులేనని చెప్పారు. అన్నింటినీ ఆధునికీకరించడం, నూతన భవనాలతోపాటు వైద్యరంగ చరిత్రలో 47 వేల పోస్టు­లను భర్తీచేసిన తొలి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమన్నారు. డాక్టర్లకు కా­ర్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో వేతనాలిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారని ఇతర రాష్ట్రాలు విస్మయం చెందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు