స్కాములన్నీ బాబు హయాంలోనే 

13 Mar, 2023 04:25 IST|Sakshi

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రజిని 

చిలకలూరిపేట: చంద్రబాబు పరిపాలన కాలంలోనే ఎన్నో కుంభకోణాలు జరిగాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను ఆదివారం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

బాబు హయాంలో రాజధాని పేరుతో రియల్‌ కుంభకోణానికి పాల్పడిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో కూడా చేసిన అవినీతి కుంభకోణం బయట పడిన విషయం ప్రజలు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని మంత్రి విమర్శించారు.

వైద్య రంగం గురించి అసలు పట్టించుకోని ముఖ్యమంత్రిగా చరిత్రలో చంద్రబాబు మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. నేడు పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందుతుంటే ఓర్వలేని చంద్రబాబు.. అర్థంలేని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఈ రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్‌కళ్యాణ్‌కు గానీ, చంద్రబాబుకు గానీ లేదని మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. బీసీలకు ఎవరైనా మేలు చేశారంటే అది జగనన్న మాత్రమేనని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు